నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..4.15కేజీల గంజాయి స్వాధీనం

By Ravi
On
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..4.15కేజీల గంజాయి స్వాధీనం

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎస్టిఎఫ్ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ దాడులు నిర్వహించి మూడు కేసుల్లో 4.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు. ధూల్‌పేట్‌లో శీలబాయి అనే మహిళ గంజాయి అమ్మకాలు  జరుపుతుందనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సి టీమ్‌ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. శీలబాయి వద్ద 2.08 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ధూల్‌పేట్‌లో మరో కేసులో చోటాలాల్‌ సింగ్‌ ఇంటిపై దాడిచేసి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
మరో కేసులో..
హైదరాబాద్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ బీ టిమ్‌ సీఐ చంద్రశేఖర్‌ గౌడ్‌,  ఎస్సై శ్రీనివాస్‌ టీమ్‌ సభ్యులు కలిసి మూషీరాబాద్‌ లాలాగూడ  ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో 1.2 కేజీల గంజాయిని, రెండు సెల్‌ ఫొన్లు, ఒక బైక్‌ను స్వాధినం చేసుకున్నారు. ఈ కేసులో శివరామ్‌, మహేందర్‌లను అరెస్టు చేశారు.  గంజాయిని పట్టుకున్న ఎస్టిఎఫ్, ఎన్‌ఫొర్స్‌మెంట్‌ టీమ్‌లను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం, డీఎస్పీ తుల శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌రెడ్డి                          అభినందించారు.IMG-20250507-WA0094

Tags:

Advertisement

Latest News