విజయ్ కెరీర్ కు ఏమైంది? కింగ్డమ్ వాయిదా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్ డమ్. లైగర్, ఫ్యామిలీ మెన్ లాంటి సినిమాలతో డిజాస్టర్స్ ని తన కెరీర్ లో డిజప్పాయింట్ అయ్యారు. ఈసారి ఎలాగైనా సరే కింగ్ డమ్ తో బాక్సాఫీస్ దగ్గర తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఉన్నారు. అందుకే మూవీ కోసం తన లుక్ ను కంప్లీట్ గా ఛేంజ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రజంట్ ఈ మూవీ ఆల్ మోస్ట్ షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకుని ఫైనల్ స్టేజ్ లో ఉంది. కింగ్ డమ్ మూవీని మే 30 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు సిట్యూవేషన్ చూస్తుంటే మళ్లీ సినిమా పోస్ట్ పోన్ అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ మే30 న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీని పోస్ట్ పోన్ చేయాలని మూవీ టీమ్ భావిస్తుందట. మరి దీనిపై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.