బాలయ్య సినిమాలో మోక్ష యాక్టింగ్?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి కాంబోలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వస్తుంది. అదే అఖండ 2 తాండవం మూవీ. ఈ ప్రాజెక్ట్ కోసం ఫిల్మ్ టీమ్ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే భారీ సెట్స్ లోని షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్టర్ ప్లాన్ చేశారు. ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నుండి టాప్ డైరెక్టర్స్ తో భారీ ప్రాజెక్ట్ లు రెడీ అవుతున్నాయి. అయితే వీటిల్లో ఓ క్రేజీ కాంబినేషన్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
అదేంటంటే.. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ కూడా యాక్ట్ చేయబోతున్నారు. నిజానికి మోక్ష ఎంట్రీ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎంట్రీతో పాటుగా మరో సినిమాలో బాలయ్య, మోక్షజ్ఞ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇపుడు అదే సాధ్యం అయ్యేలా ఉందని తెలుస్తుంది. బాలయ్యతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాలోనే మోక్షజ్ఞ కూడా కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. కాగా మోక్ష ప్రజంట్ ప్రశాంత్ వర్మతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు.