పంత్ కు సెహ్వాగ్ సలహా.. ఏం జరిగిందంటే?

By Ravi
On
పంత్ కు సెహ్వాగ్ సలహా.. ఏం జరిగిందంటే?

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్‌ పంత్ ఐపీఎల్‌ 2025 సీజన్‌ లో తన జర్నీ చాలా డల్ గా సాగుతుంది. కీలక సమయాల్లో టీమ్ ను గెలిపించే ఇన్నింగ్స్ తో ఆడలేకపోవడంతో మరింత డల్ అవుతున్నారు. ఒక్క హాఫ్ సెంచరీ చేసిన పంత్ 11 మ్యాచ్ ల్లో 128 రన్స్ చేశారు. పంజాబ్ పై 17 బంతుల్లో 18 పరుగులు చేశారు. అతని ఫామ్ పై ప్రజంట్ సెహ్వాగ్ కీలక కామెంట్స్ చేశారు. తనకు విలువైన సూచనలు ఇచ్చారు. ధోనికి వెంటనే ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా పంత్ నువ్వు ఆడిన పాత వీడియోలను చూడు. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్కోరు చేసిన రోజులను గుర్తుచేసుకోవాలి. గాయపడటానికి ముందు పంత్‌కు, ఇప్పుడు పంత్‌కు చాలా వ్యత్యాసం ఉంది. పంత్‌ను చూస్తుంటే నాకు 2006/07 సీజన్‌ గుర్తుకొస్తుంది అని అన్నారు.

అంతేకాకుండా నేను కూడా అప్పుడు పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డా. భారత జట్టు నుంచి తొలగించారు. అప్పుడు రాహుల్ ద్రవిడ్ ఓ మాట చెప్పాడు. పరుగులు చేసిన రోజుల నుంచి నా దినచర్యను తనిఖీ చేయమని చెప్పాడు. కొన్నిసార్లు దినచర్యలో ఆటంకాలు ఉన్నప్పుడు కూడా అవి మన ఆటపై ప్రభావితం చూపుతాయి అని అన్నాడు. ఆ తర్వాత నన్ను మెరుగుపర్చుకొనేందుకు ప్రయత్నించా అని సెహ్వాగ్ తెలిపారు. ఇప్పుడు నేను కూడా పంత్‌ కు ఓ సలహా ఇస్తున్నా. అతడికి మొబైల్ ఉంది కదా.. దానిని తీసుకొని ఒకరికి కాల్ చేయాలి. మీకు నెగిటివ్‌ ఆలోచనలు వస్తున్నప్పుడు దాని నుంచి మరలడానికి వేరేవారితో చర్చించాలి. అయితే పంత్‌ కు ధోనీ రోల్‌ మోడల్. అందుకే, అతడికి పంత్‌ కాల్ చేయాలి అని అన్నారు.

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!