ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు

By Ravi
On
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై వీడియోస్ చేస్తూ ఒక్కొక్కరి తప్పులను ఎండగడుతూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేసిన ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.  హైదరాబాద్ మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం అంటూ వీడియో చేసిన "నా అన్వేషణ" అన్వేష్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ ప్రకటనల మీద వరుస వీడియోలు చేసిన అన్వేష్ డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ఎస్‌ రెడ్డితో పాటు మాజీ సీఎస్‌ శాంతికుమారి, ఐఏఎస్‌ల మీద నానా దుర్భాషలాడుతూ వీడియో చేశాడు. బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనలతో ‌రూ.300 కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేశాడని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో ఆయా వీడియోలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎరక్కపోయి ఇరుక్కున్న తరహాలో  అన్వేష్ పరిస్థితి అయ్యింది అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అందరి మీద వీడియోస్ చేసే అన్వేష్ పై వీడియో చేయాలని మిగతా యూట్యూబర్స్ కి నెటిజన్లు రిక్వెస్ట్ లు చేస్తున్నట్లు సమాచారం. మరి దీనిమీద అన్వేష్ ఎమ్ చెప్తాడు. పరారీలో ఉన్న హర్ష సాయి, ఇమ్రాన్ ల కంటే ముందుగా జైల్ కి వెళ్లి ఊచలు లెక్కించి యూట్యూబ్ పోస్ట్ చేస్తాడా వేచి చూడాల్సిందే మరి.

Tags:

Advertisement