వైభవ్‌ విషయంలో గావస్కర్‌ చెప్పినట్లే జరిగిందా?

By Ravi
On
వైభవ్‌ విషయంలో గావస్కర్‌ చెప్పినట్లే జరిగిందా?

తాజాగా గుజరాత్‌ టీమ్ తో మ్యాచ్‌ లో సిక్సుల మోత మోగించి సంచలన శతకంతో ఆకట్టుకున్న 14ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై యావత్‌ క్రికెట్‌ లోకం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే, టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అతడిని ఇప్పుడే ఆకాశానికి ఎత్తొద్దని, వైభవ్‌ ఇంకా నేర్చుకోవాలన్నాడు. లేదంటే తొందరగా ఔటయ్యే ప్రమాదం ఉందని చెప్పాడు. అన్నట్లుగానే గురువారం నాటి మ్యాచ్‌లో వైభవ్‌ ఆడిన రెండో బంతికే ఔట్‌ అయ్యాడు. గురువారం ముంబయి, రాజస్థాన్‌ ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా గావస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ వైభవ్‌ ఆట తీరు గురించి ప్రస్తావించాడు. 

అతడు వేలానికి వచ్చేనాటికే.. యూత్‌ టెస్టులో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించారు. 13 ఏళ్ల వయసులోనే ఓ అంతర్జాతీయ జట్టుపై సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే, అతడి టాలెంట్‌ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఇంకా తన గేమ్‌ను డెవలప్‌ చేసుకోవాలి. ద్రవిడ్‌ నేతృత్వంలో వైభవ్‌ మరింత మెరుగవుతాడు అని గావస్కర్‌ అన్నాడు. అయితే, ఇప్పుడే అతడిని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తొద్దు. ఎందుకంటే ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్‌ కొట్టాడు. మూడో మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు అతడిని చూసి.. మొదటి బంతికే సిక్స్‌ కొడతాడేమో అని అనుకుంటారు. తక్కువ లెంగ్త్‌తో బంతులేస్తారు. దీంతో వైభవ్‌ ఔటయ్యే ప్రమాదం ఉంది అని మాజీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Latest News

నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..! నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ వేసవి శిబిరం-2025ని ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 25 మంది విద్యార్థులతోపాటు కొంతమంది చిన్నవయసు శిబిరార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెహ్రూ జూలాజికల్...
కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలు విడుదల..!
మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్‌..! 
ఫేజ్-2 శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ పనుల సమీక్ష..!
మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
పోలీసులను మిత్రులుగా భావించే స్థాయిలో పని చేయాలి. డీజీపీ జితేందర్
హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం