జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌ గా అలోక్‌ జోషి

By Ravi
On
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌ గా అలోక్‌ జోషి

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దేశ భద్రత విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మోదీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం మళ్లీ ప్రారంభిస్తుంది. బోర్డు చైర్మన్‌గా Raw మాజీ చీఫ్‌ అలోక్‌ జోషీని నియమించింది. ఏడుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో త్రివిధ దళాల మాజీ అధికారులు, ఇద్దరు మాజీ ఐపీఎస్‌లు, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారిని సభ్యులుగా చేర్చింది. 

కాగా మాజీ వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ పీఎం సిన్హా, మాజీ సదరన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే సింగ్‌, రియర్‌ అడ్మిరల్‌ మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్‌లు రాజీవ్‌ సంజన్‌ వర్మ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి బీ వెంకటేశ్‌ వర్మను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది.

Advertisement

Latest News

ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్ ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్
ఎక్సైజ్ శాఖలో  కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని  కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
మిస్ వరల్డ్ 2025 కార్యక్రమంపై సైబరాబాద్ కమిషనరేట్ లో భద్రతా సమన్వయ సమావేశం
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..