రిషబ్ పంత్‌ కు భారీ షాక్.. ఎందుకంటే?

By Ravi
On
రిషబ్ పంత్‌ కు భారీ షాక్.. ఎందుకంటే?

ఐపీఎల్ లో లక్నో టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. ఈ సీజన్ లో సెకండ్ టైమ్ స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు 24 లక్షల జ‌రిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. కెప్టెన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ఫైనల్ టీమ్ లోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు ఫైన్ పడింది. అయితే ఈ రెండిటిలో ఏది త‌క్కువ అయితే అది ఫైన్‌గా విధిస్తారు. కాగా ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయితే 90 లక్షల ఫైన్ తో పాటు డీమెరిట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ డీమెరిట్స్ పాయింట్స్ లెక్క దాటితే పంత్ ఒక మ్యాచ్ కి సస్పెండ్ అవుతాడు. ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దిష్ట సమయానికి మ్యాచ్ కంప్లీట్ చేయకపోతే బీసీసీఐ ఆ జట్టు కెప్టెన్ కు 12 లక్షలు ఫైన్ విదిస్తుంది. అదే తప్పు మళ్ళీ రిపీట్ అయితే జట్టు కెప్టెన్ 24 లక్షలు కట్టాల్సి ఉంటుంది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ నమోదైంది. 

తాజాగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ముంబై తరఫున ర్యాన్ రికెల్టన్ 58 పరుగులతో సత్తా చాటాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో ఎల్ఎస్ జీ బౌలర్లను ఉతికారేశాడు. దానికి తోడు సూర్యకుమార్ యాదవ్ 54 పరుగులతో రాణించడంతో ముంబై విజయం సులువైంది.

Tags:

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్