పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..!

By Ravi
On
పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..!

కాకినాడు జిల్లా పెనుగుదురు గ్రామంలోని స్మశాన వాటికలో తగిన సౌకర్యాల లేకపోవడం గ్రామ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యేకంగా, అంత్యక్రియల అనంతరం స్నానం చేయడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్‌లు తుప్పు పట్టి, నిర్వహణ లేకపోవడంతో ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను గ్రామ యువకులు, పబ్బినిడి హరిబాబు గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ పరిధిలో ఉన్న ఈ స్మశాన వాటికలో నిర్వహణ లోపం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.​

గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.​ స్మశాన వాటికలో తగిన సౌకర్యాలు కల్పించి, వాటర్ ట్యాప్‌లను మరమ్మత్తు చేయించి, గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్