పాకిస్థాన్ రెడీగా ఉంది: పాక్ ప్రధాని

By Ravi
On
పాకిస్థాన్ రెడీగా ఉంది: పాక్ ప్రధాని

తాజాగా జమ్మూకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెస్పాన్డ్ అయ్యారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఖైబర్ లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. పహల్గామ్ దాడిపై విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని ఆయన అన్నారు. అయితే దీనికి ముగింపు పలకాలన్నారు. 

బాధ్యతాయుతమైన దేశంగా తమ పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఏదేమైనా తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూనే.. భారత్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అన్ని రకాల వీసాదారులైన పాకిస్థానీయులు వెళ్లిపోవాలని సూచించింది. అంతేకాకుండా అటారీ-వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన చర్యల దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మున్ముందు రోజుల్లో భారత్ ఇంకెలాంటి చర్యలు తీసుకుంటుందోనని పాకిస్తాన్ భయపడుతుంది.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి