ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ కే ఎక్కువ: గావస్కర్

By Ravi
On
ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ కే ఎక్కువ: గావస్కర్

ఇండియన్ టీమ్ కు సెలెక్ట్ కావాలంటే ఇప్పుడు సులువైన మార్గం ఐపీఎల్‌. ఒకప్పుడు క్రికెట్‌లో మంచి ఆటతీరు కనబరిస్తే ఠక్కున అవకాశాలు వచ్చేవి. ఇప్పుడైతే ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్నాడా? లేదా? అనేది మేనేజ్‌మెంట్ చూస్తుందనడంలో డౌట్ లేదు. ఈ టాపిక్ పై క్రికెటర్ సునీల్ గావస్కర్ తన రివ్యూను షేర్ చేశారు. పెద్దగా పరిచయం లేని క్రికెటర్ కూడా ఐపీఎల్‌లో ఒక్క మంచి ఇన్నింగ్స్‌ ఆడినా చాలు గొప్ప గౌరవం అందుకొంటాడు. అదే నేషనల్ ఛాంపియన్‌షిప్ రంజీ ట్రోఫీలో ఎంత రాణించినా కనీసం హెడ్‌లైన్స్‌లోనూ కనిపించడు. ఐపీఎల్‌లో అలా కాదు. ఇప్పటికే ఎన్నో సందర్భాలను మనం చూశాం. సీజన్‌లో ఒకటి లేదా రెండు మ్యాచుల్లో దూకుడుగా ఆడితే అతడి పేరు మారుమోగిపోతుంది. 

కెరీర్‌ మొత్తం రంజీ ట్రోఫీ ఆడినా అది సాధ్యం కాదు. ఐపీఎల్‌కున్న భారీ ఆదరణే దీనికి కారణం. బ్రాడ్‌కాస్ట్‌పరంగానూ స్పాన్సర్‌షిప్ హక్కులు రూ.కోట్లలో ఉంటాయి. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ సీజన్‌లు అన్నీ కలిపి ఆడినా.. ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌కు వచ్చే కనీస మొత్తం రూ.30 లక్షలకు దరిదాపుల్లో ఉండదు. ఈ అసమానతను తగ్గించాల్సిన అవసరం బీసీసీఐతోపాటు అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులపై ఉందని అన్నారు.

Advertisement

Latest News