ఫ్లెక్సీలు చింపిన వారిపైన చర్యలకు డిమాండ్..!
By Ravi
On
బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అర్ధరాత్రుల్లో బ్లేడ్‌లతో చింపేసి, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై కుత్బుల్లాపూర్ గులాబీ నేతలు మండిపడ్డారు. 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందనే అక్కసుతో.. మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌కు హైప్ వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులతో కేవలం బీఆర్ఎస్ ప్లెక్సీల తొలంగిపు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్ డీసీలకు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా వినతిపత్రాలు ఇచ్చి..ప్లెక్సీలు చింపేసిన సిబ్బందిపై చర్యలకు తీసుకోవాలని సర్కిల్ కార్యాలయాల ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భాస్కర్, సోమేశ్, శ్రీకాంత్, కమలాకర్ వివిధ డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
26 Apr 2025 21:29:15
- ఒక్కొక్కటిగా వెలుగులోకి బ్యూరోక్రాట్స్ భూదందాలు
- ముందే చెప్పిన ట్రూ పాయింట్ న్యూస్ - నార్త్ బ్యూరోక్రాట్స్ అడ్డగోలు భూముల కొనుగోలు - డ్యూటీలో జాయిన్...