కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం..!
By Ravi
On
హైదరాబాద్ TPN : హయత్‌నగర్ కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రావినారాయణరెడ్డి నగర్‌లో సుమారు 300ల గుడిసెలు ఉన్నాయి. ఉన్నట్టుండి ఓ గుడిసెలో నుంచి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 30 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన 4 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నారు. గుడిసెల్లో ఉన్న సిలిండర్లు పేలుతుండడంతో.. స్థానికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Related Posts
Latest News
27 Apr 2025 05:29:22
డ్రగ్స్ కేసులలో దర్యాప్తు పకడ్బందీగా చేయడం ద్వారా నేరస్తులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ స్పష్టం చేశారు....