దోమల నివారణతో మలేరియా వ్యాధికి చెక్‌..!

By Ravi
On
దోమల నివారణతో మలేరియా వ్యాధికి చెక్‌..!

chశేఖర్‌ tpn , తిరుపతి :

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమల నిర్మూలనకు ఇంటిని తరచూ శుభ్రం చేసుకోవడం, దోమతెరలను వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్‌ బాలు సూచించారు. శ్రీకాళహస్తి  శ్రీరామ్‌నగర్ కాలనీ పట్టణ ప్రాథమిక కేంద్రం ఆవరణంలో.. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది కలిసి దోమల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారి డాక్టర్ బాలు మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్‌ని నిర్వహించాలని.. ఏఎన్ఎంలను ప్రతి ఇంటికి పంపించి దోమల అభివృద్ధి చెందకుండా.. ఇళ్ల అవరణాల్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. కొబ్బరి బోండాలు, టైర్లలో నిల్వ ఉంచిన నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందకుండా చేస్తే.. దోమలు వృద్ధి చెందకుండా చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బాలు, సూపర్‌వైజర్ కళావతి, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

Latest News