బౌరంపేటలో పారిశుద్ధ్య కార్మికుల నిరాహార దీక్షకు బీజేపీ సంఘీభావం..!

By Ravi
On
బౌరంపేటలో పారిశుద్ధ్య కార్మికుల నిరాహార దీక్షకు బీజేపీ సంఘీభావం..!

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ వార్డు కార్యాలయం ముందు.. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురించేస్తున్న కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. దుండిగల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా కమిషనర్ జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుని ఖండించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ ఏమైనా ఇంటి నుంచి ఇస్తున్నారా..? ఏ నెలకు ఆ నెల కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు సామాన్య కింది స్థాయి చిరు ఉద్యోగులు.. కుటుంబం గడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కావున ఈ నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కార్మికులు మాట్లాడుతూ మూడు నెలలు గడుస్తున్నా.. జీతాలు లేక, ఇంట్లోకి సరిపోయే వస్తువులు తెచ్చుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేదని వాపోతున్నారు. తమ జీతాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయని.. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి తమ జీతాలను విడుదల చేయించవలసిందిగా కార్మికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు గోనెమల్లారెడ్డి, నల్ల రామచంద్రారెడ్డి, సీతారాంరెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News