ఒంగోలు వీరయ్యచౌదరి హత్యకేసులో కీలక ఆప్‌డేట్‌..!

By Ravi
On
ఒంగోలు వీరయ్యచౌదరి హత్యకేసులో కీలక ఆప్‌డేట్‌..!

ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేపిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు వాడిన స్కూటీని పోలీసులు గుర్తించారు. వీరయ్య చౌదరిని దారుణంగా కత్తులతో పొడిచి చంపిన తరువాత నిందితులు ఒక బైకు, స్కూటీపై ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. నిందితులు స్కూటీని చీమకుర్తి శివారు ప్రాంతంలో ఉన్న చెట్లలో వదిలి పెట్టి వెళ్లారు. నిందితుల కోసం 12 టీములుగా గాలిస్తుండగా.. చీమకుర్తి శివారులో నిందితులు వదిలిపెట్టి వెళ్లిన స్కూటీని పోలీసులు గుర్తించారు. వీరయ్య చౌదరిని ఒంగోలులోని ఆయన కార్యాలయంలో ఈనెల 22న రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. హత్యకు వాడిన కత్తులను ఓ బ్యాగ్‌లో స్కూటీపై తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. నిందితులు వాడిన వైట్ స్కూటీ వెనుక భాగం మొత్తం కత్తుల నుంచి కారిన రక్తపు మరకలతో నిండిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ కోసం క్షుణంగా పరిశీలిస్తున్నారు. వీరయ్య చౌదరి దారుణ హత్య జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా నిందితులు వాడిన స్కూటీ చిక్కడంతో పోలీసుల దర్యాప్తుకి ఊపిరి లభించింది.

Advertisement

Latest News