దేశ భద్రతకు ముప్పుగా మారిన రోహింగ్యాలు : బీజేపీ

By Ravi
On
దేశ భద్రతకు ముప్పుగా మారిన రోహింగ్యాలు : బీజేపీ

హైదరాబాద్‌ బాలాపూర్ మండలంలో అక్రమంగా రోహింగ్యా వలసదారుల ప్రవేశం దేశ భద్రతకు ఉగ్ర ముప్పుగా మారిందని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడం రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్థుల ముసుగులో దేశంలోకి ప్రవేశించి, నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు సృష్టించి భారతీయుల్లా మసులుతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం చట్ట విరుద్ధ చర్య మాత్రమే కాదని.. ఇది దేశాన్ని లోపల్నుంచి దెబ్బతీసే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి స్థావరాల చుట్టుపక్కల మతపరమైన శిబిరాలు, అనుమానాస్పద మదర్సాలు ఏర్పడుతున్నట్లు స్థానిక సమాచారం స్పష్టంగా చెబుతోందన్నారు. ఇదంతా భారత ప్రజాస్వామ్యం పట్ల తలెత్తిన సవాల్ అని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు బాలాపూర్ పోలీస్ స్టేషన్‌ అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రె, నవార్ శ్రీనివాస్ రెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, అందెల ఐలయ్య, వరికుప్పల వెంకటేష్, రమేష్, రామిడి శేఖర్ రెడ్డి, అరవింద్, మిరియాల వేణుగోపాల్, భువనచంద్ర, ప్యాట నరేష్, వరికుప్పల కిరణ్, రాజ్ చెట్టి, చైతన్య వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News