బేగంపేటలో చైన్‌స్నాచర్‌ అరెస్ట్‌..!

By Ravi
On
బేగంపేటలో చైన్‌స్నాచర్‌ అరెస్ట్‌..!

దొంగలించిన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ.. ఒంటరిగా ఉన్న వృధ్ధ మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న క్రాంతికుమార్‌ అనే వ్యక్తిని బేగంపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన క్రాంతి కుమార్ నుంచి 8 లక్షల విలువైన 9 తులాల బంగారంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. చిక్కడపల్లి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసిన క్రాంతి కుమార్.. ఇటీవల మారేడుపల్లిలో దుకాణం అద్దెకు కావాలంటూ ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించినట్లు తెలిపారు. అనంతరం బేగంపేటలో ఇంట్లో పడుకొని ఉన్న మహిళల నుంచి కూడా బంగారు గొలుసును లాకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. దొంగిలించిన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న క్రాంతి కుమార్‌ను 300 సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకున్నట్లు వివరించారు. తిరుపతికి చెందిన క్రాంతి కుమార్‌పై ఇరు రాష్ట్రాల్లో 14 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇంట్లో ఉండే మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు.

Advertisement

Latest News

హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు