హైకోర్టులో మెట్రో రైల్లో బెట్టింగ్ ప్రమోషన్ పై విచారణ
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్‌ను అడ్వకేట్ నాగూర్ బాబు దాఖలు చేశారు. పిల్‌లో, HMRL బోర్డు డైరెక్టర్స్‌పై CBI దర్యాప్తు జరిపించాలని కోరారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైల్లో IAS, IPS అధికారులు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌గా ప్రమోషన్లు ఎలా అనుమతించారో అని పిటిషనర్ ప్రశ్నించారు.
మరింతగా, HMRL లేదా దాని అనుబంధ సంస్థలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడానికి ఎన్నికోట్ల ముడుపులు తీసుకున్నారా అన్న కోణంలో ED దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరారు. తెలంగాణ గేమింగ్ అమండమెంట్ ఆర్ట్ 2017 అమల్లో ఉందని కూడా పేర్కొన్నారు.
ఇది సంబంధించి మెట్రో రైలు MDకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారం వాయిదా వేయబడింది.