ట్రిపుల్ సెంచ‌రీ.. బుమ్రా అరుదైన రికార్డ్..

By Ravi
On
ట్రిపుల్ సెంచ‌రీ.. బుమ్రా అరుదైన రికార్డ్..

టీమిండియా స్టార్‌, ముంబై ఇండియన్స్‌ పేసర్ జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు ను క్రియేట్ చేశారు. టీ20 క్రికెట్‌లో బుమ్రా 300 వికెట్ల మైల్ స్టోన్ ను రీచ్ అయ్యారు. ఈ ఐపీఎల్ సీజన్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో సన్ రైజర్స్ టీమ్ తో ఆడిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేయడంతో బుమ్రా ఈ ఘనతను సాధించారు. దీంతో అత్యంత వేగంగా 300 వికెట్స్ పడగొట్టిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. 237 ఇన్నింగ్స్‌లలో 300 వికెట్ల మార్కును అందుకున్నాడు. 

300 వికెట్స్ పడగొట్టిన రెండో భారత ఫాస్ట్ బౌల‌ర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ 318 వికెట్స్ తో ముందున్నాడు. ఓవ‌రాల్‌గా ఈ ఘ‌న‌త సాధించిన ఐదో భార‌త బౌల‌ర్‌గా బుమ్రా నిలిచాడు. యుజ్వేంద్ర చహల్ 373 వికెట్లు, పీయూష్ చావ్లా 319 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 318 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 315 వికెట్లతో బుమ్రా కంటే ముందున్నారు. మరోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ల‌సిత్ మ‌లింగ‌ రికార్డును బుమ్రా ఈక్వల్ చేశాడు. మ‌రో వికెట్ ప‌డ‌గొడితే మ‌లింగ రికార్డును బ్రేక్ చేస్తాడు. మరి అప్ కమింగ్ మ్యాచుల్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!