బాచుపల్లి టాటా సర్వీస్ స్టేషన్ లో అగ్నిప్రమాదం.. కస్టమర్ల కార్లు దగ్ధం
By Ravi
On
బాచుపల్లి పిఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రేణుక ఎల్లమ్మ కమాన్ వద్ద ఉన్న టాటా సర్వీస్ స్టేషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి స్పాట్ కి వచ్చిన పోలీసులు ఫైర్ ఇంజన్లతో కలిసి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల సర్వీస్ స్టేషన్ లో కస్టమర్లకు చెందిన కార్లు దగ్ధం అయ్యాయి. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
05 May 2025 06:59:52
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న...