అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు

By Ravi
On
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు

విజయనగరం TPN : పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు ఇల్లు కాలిపోవడంతో పాటు  పెళ్లి కోసం సమకూర్చుకున్న నగదు కాలిపోయిన  కుటుంబానికి అండగా 20 వేలు రూపాయిలు ఆర్థిక సహాయం మరియు వంట సామాగ్రి, ఆరు బియ్యం ప్యాకెట్లు మరియు దుస్తులను అందజేసిన ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు. అలాగే ప్రమాదంలో ఇళ్ళు కాలిపోయిన మిగిలిన ఐదు కుటుంబాలకు ఒక్కొకరికి 3 వేలు రూపాయలు నగదు, వంట సామాగ్రి, 5 బియ్యం ప్యాకెట్లు మరియు దుస్తులను కర్రోతు బంగార్రాజు తన స్వంత నిధులతో సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్రావు, గ్రామ సర్పంచ్ పైడిరాము, స్థానిక ఎంపీటీసీ రామునాయుడు, మండల ప్రధాన కార్యదర్శి పిన్నింటి శ్రీనివాసరావు, మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలపల్లి సింహాచలం, క్లస్టర్ ఇన్చార్జిలు సామంతుల సొంబాబు, దంగా భూలోక మరియు ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఇక అదిరిపోనున్న హైదరాబాద్ ఇక అదిరిపోనున్న హైదరాబాద్
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు