ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
భారత ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న టైమ్ లో వీరిద్దరూ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. సుంకాలపై భారత్, అమెరికా చర్చలు జరుపుతున్న సమయంలో మస్క్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరు దేశాలు కూడా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకునే దిశలో ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాను టెక్ బిలియనీర్ మస్క్‌తో మాట్లాడానని, సాంకేతికత, ఆవిష్కరణల సహాకారంలో అపారమైన సామర్థ్యాలపై చర్చించామని చెప్పారు. మరోవైపు, ఏప్రిల్ 21-24లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వన్స్ పర్యటన కూడా ఉండబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. మరికొన్ని నెలల్లో టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ముంబైకి వేల సంఖ్యలో కార్లను దిగుమతి చేయనున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ముంబై, ఢిల్లీ, బెంగళూర్లలో అమ్మకాలు ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది.