పంత్, శ్రేయస్ విషయంలో అదంతా నిజం కాదు: ప్రీతీ జింతా
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. లక్నో టీమ్ రూ.27 కోట్లను వెచ్చించి రిషభ్ పంత్ ను తీసుకుంది. పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లతో శ్రేయస్ ను సొంతం చేసుకుంది. వీరిద్దరి కోసం తీవ్రస్థాయిలోనే పోటీ జరిగింది. పంత్ ను తీసుకుందామని రికీ పాంటింగ్ కూడా భావించినట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ లో పనిచేశారు. అయితే, మేనేజ్‌మెంట్ మాత్రం శ్రేయస్ అయ్యర్ వైపు ఫోకస్ చేసింది. ఈక్రమంలో పంత్, శ్రేయస్ గురించి తానేదో కామెంట్స్ చేసినట్లు వస్తున్న వార్తలను ప్రీతీజింతా కొట్టిపడేసింది. అవన్నీ తప్పుడివేనని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
అయితే ఒక ఇంటర్వ్యూలో పంత్ మాట్లాడుతూ నేను ఎప్పుడూ పంజాబ్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించను అని అన్నట్లుగా.. దానికి ప్రీతీ జింతా స్పందిస్తూ మెగా వేలం సమయంలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌ను పరిశీలించాం. జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆప్షన్లు పెట్టుకున్నాం. కానీ, మాకు గొప్ప ప్రదర్శన చేసే ఆటగాడు కావాలి. అంతేకానీ, గొప్ప పేరున్నవారు కాదు. అందుకే, రిషభ్‌ను కాదని శ్రేయస్‌ను తీసుకున్నాం అని కామెంట్స్ చేశారు.