నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్..

By Ravi
On
నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్..

ఐపీఎల్ 2025 లో ఫస్ట్ సూపర్ ఓవర్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఈరోజు లక్నో టీమ్ తో తలపడనుంది. రాజస్థాన్ ఈ మ్యాచ్ ను తన సొంత గ్రౌండ్ జైపూర్ లో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ కు ముఖ్యం. లేకుంటే ప్లేఆఫ్స్ రేస్ కష్టమవుతుంది. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. కానీ బ్యాట్స్‌మన్ ఇక్కడ కొంత సమయం గడిపితే, సులభంగా పరుగులు సాధించొచ్చు. ఏదేమైనా, బ్యాట్స్‌మెన్‌ పై బౌలర్లకు స్వల్ప ఆధిక్యం ఉంటుంది. ఫస్ట్ ఓవర్లలో బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది, కానీ తర్వాత పిచ్ నెమ్మదిస్తుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి 175 పరుగులు చేసి వారిని ఓడించింది. 

ఇక ఈ గ్రౌండ్ లో టాస్ చాలా ముఖ్యం. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్‌లపై దృష్టి సారిస్తుంది. బౌలింగ్ లో రాజస్థాన్ కు చెందిన సందీప్ శర్మ ఈ పిచ్ పై అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. లక్నో విషయానికొస్తే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్ క్రమ్ మెరుపు బ్యాటింగ్ కు ఛాన్స్ ఉంది. బౌలింగ్‌లో దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!