అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
By Ravi
On
హైదరాబాద్ వనస్థలిపురంలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. స్థానిక ఇంజాపూరంలో రోడ్డును ఆక్రమించుకొని చేసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. స్థానికంగా స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ యాజమాన్యం కాలనీ రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేసింది. దీంతో కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని అనేకసార్లు కంపెనీ యాజమాన్యం, మున్సిపల్ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో.. చివరకు గ్రామస్తులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు విచారణ చేసి ఆక్రమణ నిజమే అని తేల్చారు. అనంతరం జేసీబీలతో ఆ నిర్మాణాలు నేలమట్టం చేశారు. దీంతో స్థానికులు హైడ్రా అధికారులను అభినందించారు.
Related Posts
Latest News
19 Apr 2025 22:02:54
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...