అంజన్‌కుమార్‌యాదవ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
By Ravi
On
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి దగ్గర ధర్నాకు దిగారు. అంజన్ కుమార్ యాదవ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కిషన్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వాటిని పరిష్కరించకుండా రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
Latest News
19 Apr 2025 17:55:41
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...