కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!

By Ravi
On
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబానికి భారతీయ చట్టాలు వర్తించవా..? రాజ్యాంగానికి వారు అతీతులని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు డూప్లికేట్ గాంధీ కుటుంబం చేసిన కుట్ర అని విమర్శించారు. యూపీఏ హయాంలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని.. కానీ.. అరెస్ట్ కాకుండా బెయిల్  సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బెయిల్‌ తెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఇందులో బీజేపీ, మోదీ పాత్ర ఏముంది..? అని నిలదీశారు. 
'కాంగ్రెస్ కార్యకర్తలారా.. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీ వాటా కూడా ఉంది. మీరు ధర్నా చేయాల్సింది.. టెన్ జన్‌పథ్ సోనియా ఇంటి ముందు.. తప్పు చేస్తే సోనియా సహా అందరూ జైలుకు వెళ్లక తప్పదు. రాహుల్ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఫోర్త్‌సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతోంది' అనిఆరోపించారు. సుబ్రమణ్యస్వామి కేసులతో బీజేపీకి ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. 

గతంలో దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయి? ప్రస్తుతం జపాన్ పర్యటన కూడా అంతే..! అని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య స్నేహితులని.. బీఆర్ఎస్ అవినీతి కేసులన్నీ నీరుగార్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. విద్యుత్ కొనుగోళ్ల స్కామ్‌పై నివేదిక ఇచ్చినా కేసీఆర్‌కు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు..? అని నిలదీశారు. 

ఇకపోతే.. బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముమ్మాటికీ కారణం రేవంత్ రెడ్డి కాబోతున్నారని జోస్యం చెప్పారు. రేవంత్ ఆర్ధిక సహకారంతోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన చేస్తోందని ఆరోపించారు. 
దీనిని అడ్డుకోకపోతే జరగబోయే పరిణామాలకు రేవంత్‌రెడ్డి సర్కారే బాధ్యత వహించక తప్పదని హెచ్చరించారు. వక్ఫ్ ఆస్తులను ఒవైసీలాంటి కుటుంబాలు ఆక్రమించుకుని లబ్ది పొందుతున్నాయని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులు, ఆదాయంతో పేద ముస్లింలకు నయాపైసా ప్రయోజనం లేకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో చేసిన వక్ఫ్ చట్టం అత్యంత ఘోరమైనదని.. టైటిల్ ఉన్న వాళ్ల భూములను కూడా వక్ఫ్‌కు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు, గురుద్వారా, క్రైస్తవులు, మత్సకారులు, లింగాయత్ సాగు భూములను కూడా వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్నారని చెప్పారు. ఆఖరుకు పార్లమెంట్ కూడా వక్ఫ్ పరిధిలో ఉందంటూ అవాకులు పేలుతున్నారని ఫైరయ్యారు. 

సీఎంకు దమ్ముంటే.. తెలంగాణలోని వక్ఫ్ భూములు, ఆస్తులు, ఆదాయంపై హైడ్రాతో విచారణ చేయించాలని సవాల్‌ విసిరారు. వక్ఫ్ ఆస్తులు, ఆదాయ, వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వక్ఫ్ ఆస్తుల్లో ఆసుపత్రులు కట్టి టెర్రరిస్టులను దాస్తున్నారని ఆరోపించారు. ఒవైసీ పెట్టబోయే సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామని ఎద్దేవా చేశారు. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ దూరంగా ఉండాలని రాహుల్ చెప్పడం పెద్ద జోక్ అన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్‌లారా.. అంతరాత్మ ప్రకారమే ఓటేయండి అని పిలుపునిచ్చారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటే హైదరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!