యూఎస్ ఉద్యోగులపై ఆరోపణలు.. 

By Ravi
On
యూఎస్ ఉద్యోగులపై ఆరోపణలు.. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై తాజాగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్‌ తీరుపై దారుణంగా లే ఆఫ్‌లు అమలు చేస్తోందని ఆరోపించారు. హెచ్‌1 బీ వీసా కలిగిన భారతీయ ఎంప్లాయిస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ ఆరోపణల్ని టీసీఎస్‌ ఖండించింది. ఈ మాటల్లో వాస్తవం లేదని కేవలం తప్పుడు ఆరోపణలు మాత్రమే అని ఆ సంస్థ అధికారికంగా పేర్కొంది. తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని టాటా కన్సల్టెన్సీ చెప్పుకొచ్చింది. 

కాగా, ఈ వివాదంపై అమెరికాలో సమాన ఉపాధి అవకాశాల కమిషన్‌ విచారణ కొనసాగిస్తుంది. కాగా, గతంలో బ్రిటన్‌లో ముగ్గురు టీసీఎస్‌ ఉద్యోగులు వయసు, జాతీయత ఆధారంగా వివక్షకు గురైనట్లు పలు నివేదికలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఫలితాలను ప్రకటించిన టీసీఎస్‌.. అమెరికా కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపు రేటు 13 శాతం నుంచి 13.3 శాతం పెరిగింది. యూఎస్ టారిఫ్‌ల కారణంగా వరల్డ్ వైడ్ గా తలెత్తిన అనిశ్చితితో 6.07 లక్షల మంది ఉద్యోగులకు వార్షిక వేతన పెంపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!