త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా ఎవరు వస్తారని ఆసక్తి క్రియేట్ అయ్యింది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడ్ని అనౌన్స్ చేయనుంది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉందన్నారు. తర్వాత కేబినేట్ విస్తరణ కూడా ఉండే ఛాన్సుందని తెలుస్తుంది. ప్రజంట్ బీజేపీ అధ్యక్ష రేస్ లో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మనోహర్ లాల్ ఖట్టర్‌కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో ఖట్టర్‌కు మంచి సంబంధాలు ఉన్నట్లుగా టాక్. ఈ నేపథ్యంలో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. తర్వాత మోడీ కేబినెట్ విస్తరణ చేసే అవకాశం కూడా ఉంది. త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొచ్చని సమాచారం. ఎన్‌సీపీ, శివసేనతో పాటు బీహార్‌లోని ఇతర మిత్రపక్షాలకు చోటు లభించే ఛాన్సుంది. ఇక బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా వంటి నేతకు కేబినెట్‌లో చోటు లభించే ఛాన్సు కూడా కనిపిస్తుంది.