భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

By Ravi
On
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతీయ సంస్కృతికి, వారసత్వానికి గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీనిపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని అన్నారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు అని, ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో తెలిపారు. 

ఈ విషయంపై ప్రధాని మోదీ రెస్పాన్డ్ అవుతూ.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం.. మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయం ప్రస్తుతం నేషనల్ వైడ్ గా గర్వకారణంగా మారింది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!