సంజు శాంసన్ కు ఫ్యాన్స్ సూచనలు..

By Ravi
On
సంజు శాంసన్ కు ఫ్యాన్స్ సూచనలు..

రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజు శాంసన్‌ల మధ్య గొడవలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సూపర్ ఓవర్ రిజల్ట్ అని తెలుస్తోంది. ఐపీఎల 2025 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్‌ రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ పై ఢిల్లీ విజయం సాధించింది. ఇదే కారణమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ కు వచ్చేయమని సూచనలు చేశారు. నిజానికి ఢిల్లీతో సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రియాన్ పరాగ్‌, షిమ్రోన్ హెట్‌ మయెర్‌ వచ్చారు. 

యశస్వి జైస్వాల్‌ను రెండో వికెట్‌గా పంపించారు. సాధారణంగా సంజుశాంసన్‌ ఓపెనర్‌గా వస్తాడు. కానీ పక్కటెముకల నొప్పి కారణంగా సంజు గ్రౌండ్ లోకి రాలేదు. దీంతో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశారు. సూపర్ ఓవర్ కు ముందు కోచ్ ద్రవిడ్ తన టీమ్ తో మాట్లాడుతూ కనిపించాడు. కెప్టెన్ సంజు మాత్రం డగౌట్ కు దగ్గరగా ఉండగా, దగ్గరకు రమ్మని పిలిచినా వెళ్లలేదు. దీంతో అభిమానులు సంజును కెప్టెన్సీని వదిలేయమని సూచించడంతోపాటు జట్టును మారిపోవాలని కోరారు.

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..