ఆర్సీబీ కెప్టెన్ పై బౌలర్ భువీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఆటతో ముందుకు సాగుతుంది. రజత్ పటీదార్ నాయకత్వంలో కప్ సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఆర్సీబీ ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ టీమ్ నేటి మ్యాచ్ తో అగ్రస్థానంలోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. రెండు టీమ్స్ కి ఇది ఏడో మ్యాచ్. దీంతో లీగ్ స్టేజ్ లో సగం మ్యాచ్ లు ఆడినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో తమ టీమ్ రజత్ పై సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసించారు. ప్రశాంతంగా ముందుకు సాగిపోవడమే రజత్ బలంగా మారిందని కామెంట్ చేశారు.
కెప్టెన్ గా రజత్ కు తిరుగులేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో ఇది చాలా అవసరం. కొందరు ఒక మ్యాచ్ ఓడిపోగానే కంగారు పడిపోతుంటారు. కానీ, రజత్ అలా కాదు. మేం రెండు మ్యాచుల్లో పరాజయం చవిచూశాం. మేం గెలిచినా.. ఓడినా ఒకేలా ఉంటాడు. తీసుకొనే విధానం బాగుంటుంది. ప్రశాంతంగా ఉండటం వల్లే మిగతా వారిపై ఒత్తిడి లేకుండా పోతుంది. ప్రతి విషయాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తాడు. బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఏమాత్రం సందేహించడు అని భువీ చేసిన కామెంట్స్ ప్రజంట్ వైరల్ అవుతున్నాయి.