గుజరాత్ టీమ్ లోకి శ్రీలంక మాజీ కెప్టెన్..

By Ravi
On
గుజరాత్ టీమ్ లోకి శ్రీలంక మాజీ కెప్టెన్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో సెకండ్ టాపర్ గా ఉన్న గుజరాత్ టీమ్ లో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కు దెబ్బ తగలడంతో ట్రోర్నీ నుండి దూరం అయ్యారు. ఇతనికి ఆల్టర్ నేట్ గా శ్రీలంక లిమిటెడ్ ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను తీసుకున్నారు. అయితే షనక 2023 సీజన్ లో గుజరాత్ కు కెప్టెన్ గా ఉన్నారు. ఈ సీజన్ మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలినా.. ఫిలిప్స్ దూరం కావడంతో షనకను 75 లక్షలకు కొనుగోలు చేశారు. సో షనక త్వరలోనే గుజరాత్ తరఫున మ్యాచ్ ఆడుతాడు. 

ఇక 2023 సీజన్‌లో గుజరాత్‌ తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన షనక కేవలం 26 పరుగులే చేశాడు. ఆల్‌రౌండర్‌ అయిన అతడు ఆ సీజన్‌లో బౌలింగ్‌ చేసే ఛాన్స్ రాలేదు. అయితే, ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ టైటిల్‌ గెలిచిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టులో షనక మెంబర్ గా ఉన్నాడు. కాగా, శ్రీలంక తరఫున 6 టెస్ట్‌లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడిన షనక.. టెస్ట్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీతో పాటు 13 వికెట్లు తీసుకోగా.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలు, 27 వికెట్లు ఉన్నాయి. మరి ఈ సీజన్ లో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!