హిట్ 3 పైనే అందరి ఫోకస్..
టాలీవుడ్ లో ప్రజంట్ చెప్పుకోదగ్గ సినిమాలు అంతగా లేవు. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండేల్, కోర్ట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాలుగా నిలిచాయి. నిజానికి బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేమీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో థియేటర్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. అయితే ఏప్రిల్ నెలలో కూడా ఈ డల్ మూమెంట్ కంటిన్యూ అయ్యింది. సింగిల్ థియేటర్లు హౌజ్‌ఫుల్ బోర్డులు చూసి చాలా రోజులవుతుంది. ఇదే విషయాన్ని టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చెబుతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఓదెల 2 మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఈరోజు రిలీజ్ అయిన అర్జున్ S/O వైజయంతికి మంచి రిజల్ట్ దొరికితే కొంతమేర థియేటర్లకు రిలీఫ్. కానీ పూర్తిస్థాయిలో థియేటర్లు జనాలతో నిండాలంటే సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ కావాల్సిందే. ఇలాంటి బజ్ క్రియేట్ చేసిన సినిమా హిట్3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. హీరో నాని కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కథలో దమ్ముంటేనే సినిమాను చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఒక్కటే థియేటర్లకు దిక్కు అయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.