థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
ఇండియన్ సినిమా రేంజ్ ఇప్పుడు ప్రపంచస్థాయికి చేరుతుంది. సౌత్ అండ్ నార్త్ ఇండియాల్లో లెజండరీ డైరెక్టర్ గా మణిరత్నంకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబోకి ఇంకా మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన నాయకుడు మూవీ ఎప్పటికీ గుర్తుంటుంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబో రిపీట్ అవ్వబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మరేదో కాదు థగ్ లైఫ్. కోలీవుడ్ నుండి ఒక సాలిడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ఒక్కో అప్డేట్ ఇస్తూ వచ్చారు. ఈ విధంగా జూన్ కు రిలీజ్ చేయాలని మూవీ టీమ్ రెడీ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా మేకర్స్ సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంఛ్ కి కూడా కోలీవుడ్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టి అందులోని ప్రెస్ మీట్ కూడా పెట్టి లాంచ్ చేస్తుండడం అనేది వారు ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఎలాగో ఆడియో లాంచ్ కూడా ఉంది కానీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కే ఇంత హడావుడిగా ప్లాన్ చేస్తుండడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో వేచి చూడాలి.