ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి

By Ravi
On
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి

హైదరాబాద్ TPN :

ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి పోలింగ్, కౌంటింగ్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఓపీఓలకు రెండో విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్‌లకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ... పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో సజావుగా జరిగేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సాధారణమే అయినప్పటికీ అజాగ్రత్తగా ఉండవద్దని, ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎవరి బాధ్యతలు వారు సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ మొదలు.. పోలింగ్ ముగిసే వరకు చేయాల్సిన ప్రక్రియను ఆయన వివరించారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ అకౌంట్, పేపర్ సీల్, బ్యాలెట్ బాక్స్ ఓపెన్, సీల్ తదితర అంశాలపై పూర్తి సుశిక్షితులై ఉండాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరగాలని, ఎలాంటి తప్పిదాలు లేకుండా కౌంటింగ్ సిబ్బంది పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలోని అన్ని విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలని తెలిపారు. 

శిక్షణలో భాగంగా అధికారులకు పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్స్, బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవడం, ఎన్నికల నియమ నిబంధనలు, బ్యాలెట్ బాక్సుల సీల్ విధానం, సంబంధిత ఫారాలు పూరించడం, ప్రిసైడింగ్ అధికారి అధికారాలు, విధులు, పోలింగ్ అధికారుల విధులు తదితరాలను మాస్టర్ ట్రైనర్స్ వివరించారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో నిర్వర్తించాల్సిన విధులు, నియమ నిబంధనలను కౌంటింగ్ అధికారులకు వివరించారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!