ఆర్థికంగా కుప్పకూలిన హమాస్..
గాజాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ నిధులు లేక అల్లాడుతుంది. కనీసం సంస్థలో సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి జారిపోయింది. ఈ పరిస్థితిని అరబ్ వర్గాలు గ్రహించాయి. ఈ విషయాన్ని గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించడంతో హమాస్ దోచుకుని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని పేర్కోన్నారు. దీంతో పాటు ఆ సంస్థలో నిధుల పంపిణీకి రెస్పాన్సిబిలిటీ వహించేవారిని గుర్తించి మరీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేస్తున్నాయి.
హమాస్ గాజాకు చేరే మానవీయ సాయాన్ని పక్కదారి పట్టడం లాంటి చేసేవని అన్నారు. విదేశీ నగదుతో బయట మానవీయ సాయం, నిధుల పంపిణీ పెరిగింది. కానీ మార్చి నాటికి వీటిని బాగా తగ్గించారు. దీంతో హమాస్ శ్రేణులకు అందే సొమ్ముల్లో కూడా భారీగా నష్టపోయింది. గాజాలో పోరు మొదలయ్యాక నిధుల రాక బాగా కష్టతరంగా మారిపోయింది. అమెరికా ఆంక్షలు కూడా దీనికి కారణంగా నిలిచాయి.