హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..

By Ravi
On
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..

హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులను నిలిపివేసింది. లేటెస్ట్ గా యూనివర్సిటీ ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ను కోరినట్లుగా నివేదిక అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని రీసెంట్ గా వైట్‌హౌస్ ఆరోపించింది. 

జో బైడెన్ పదవీకాలంలో అమెరికాలోని అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ అయితే ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ కత్తి కట్టినట్లుగా కనిపిస్తోంది. విశ్వవిద్యాలయాలకు పన్ను మినహాయింపు తొలగింపు అనేది చాలా అరుదుగా జరుగుతోంది. అలాంటిది హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో మాత్రం ట్రంప్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులకు ట్రంప్ సూచన ఇచ్చారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!