ది గోట్ లైఫ్ మూవీకి 9 అవార్డులు..
కేరళలో రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్, ప్రముఖులు అంతా అటెండ్ అయ్యారు. కాగా ఈ వేడుకకు కేరళ సీఎం పినరయి విజయన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ వేడుకలో ది గోట్ లైఫ్ ఆడు జీవితం మూవీకి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను అందించారు. ఈ సినిమా ఏకంగా తొమ్మిది కేటగిరిల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో సౌదీలో కూలీలు పడే కష్టాలు చూపిస్తూ.. డైరెక్టర్ బ్లెస్సీ ఎంతో చక్కగా తెరకెక్కించారు. లాస్ట్ ఇయర్ మార్చి 28 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. కరోనా టైమ్ నుండి కష్టపడి చేసిన ఈ సినిమా అంచనాలకు మించి మంచి విజయం అందుకుంది. ఓవరాల్ గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ లో ఒకటిగా నిలిచింది. కాగా పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రజంట్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రాజెక్ట్ చేస్తున్నారు.