తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

By Ravi
On
తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.తొట్టంబేడు మండలంలోని సబ్ రిజిస్టర్ సుధాకర్ మరియు అతనితో సంబంధం ఉన్న ఏజెంట్ సుబ్బరాయుడు పై రైతులు, ప్రజలు అవినీతి ఆరోపణలు చేస్తూ పలు మార్లు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే స్పందించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ కార్యకలాపాలను తనిఖీ చేసి, సంబంధిత అధికారులకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.కె.వి.పురం మండలం గురుకుల కండ్రిగ గ్రామానికి చెందిన రైతు జనార్దన్ రెడ్డి, తన మార్ట్‌గేజ్ రద్దు కోసం గత 20 రోజులుగా కార్యాలయ చుట్టూ తిరుగుతూ లంచం కోరుతున్నారన్న ఫిర్యాదును ఎమ్మెల్యేకు తెలియజేయగా వెంటనే స్పందించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడైనా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి జరిగితే, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తొట్టంబేడు ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్రవ్యాప్తంగా అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చురుకైన చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Advertisement

Latest News