అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..

By Ravi
On
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాల్లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూకంపాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం భూమి సారం తగ్గిపోవడమే అని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా తాజాగా అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో నేడు తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. బాగ్లాన్‌ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 

మొదట 6.4 మాగ్నిట్యూడ్‌ తో భూకంపం వచ్చిందని ఈఎంఎస్‌ఈ ప్రకటించడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌లో వచ్చిన భూకంపం ప్రభావం భారత్‌ వరకు చూపింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోనూ భూప్రకంపనలు వచ్చాయి. కాగా, అఫ్గాన్‌లో వచ్చిన భూకంపానికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా భూమిలోని వనరులు అన్నీ అంతం అయిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. కాగా రీసెంట్ గా అఫ్ఘనిస్తాన్ కు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూకంపం ఆనవాలు కనిపించాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Latest News