ఓటమి బాధ్యత నాదే: అజింక్య

By Ravi
On
ఓటమి బాధ్యత నాదే: అజింక్య

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓటమి బాధ్యతను తానే తీసుకుంటా అని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే చెప్పారు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే అని అన్నారు. ఈ ఓటమితో కుంగిపోమని, ఇక ముందు మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం అని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 16 పరుగుల తేడాతో ఓడింది. పంజాబ్‌ నిర్ధేశించిన 112 పరుగుల లక్ష్యానికి కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ తర్వాత కేకేఆర్ ఓటమిపై కెప్టెన్ అజింక్య రహానే రెస్పాన్డ్ అయ్యారు. మ్యాచ్ గురించి వివరించడానికి పెద్దగా ఏమీ లేదు. 

గ్రౌండ్ లో ఏమి జరిగిందో మనమందరం చూశాము. మా ప్రయత్నం పట్ల కాస్త నిరాశగా ఉంది. కేకేఆర్ ఓటమి బాధ్యతను నేనే తీసుకుంటా. బంతి మిస్‌ అయి ఎల్బీగా ఔటయ్యాను. జట్టుగా బ్యాటింగ్‌లో మేము ఫెయిలయ్యాం. ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ లక్ష్యాన్ని మేము సులభంగా ఛేదించాల్సింది. ఈ ఓటమితో కుంగిపోము, మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ సానుకూల ధోరణితోనే ఉన్నాం. ఇక ముందు మ్యాచ్‌ల్లో సానుకూలంగా ముందుకు వెళతాం అని రహానే తెలిపాడు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!