కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..

By Ravi
On
కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కాంబో కోసం సౌత్ ఇండియా మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పార్ట్ కాబోతుంది. మరి ఈ సినిమాలో పూజా పోర్షన్ ఏంటి అనే విషయం రీసెంట్ గా రివీల్ చేశారు. 

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూలీ ప్రాజెక్ట్ లో తాను కేవలం ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. రజనీ నుండి రీసెంట్ గా వచ్చిన జైలర్ లో తమన్నాపై కావాలయ్యా సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ లో పూజా సాంగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని పూజా చెబుతుంది. మరి అనిరుద్ ఈసారి ఎలాంటి బీట్స్ ని తలైవర్ కోసం అందించాడో వేచి చూడాలి. ఇక ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Advertisement

Latest News