దేవర 2 పై కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..

By Ravi
On
దేవర 2 పై కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దేవర. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ యాక్ట్ చేసింది. డైరెక్టర్ కొరటాల శివ భారీ స్థాయిలో తెరకెక్కించిన దేవర మూవీ అన్ని జానర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కోసం అందరూ ఎప్పట్నుండో వెయిట్ చేస్తున్నారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరికి దేవర 2 ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో జపాన్ లో దేవర మూవీని రిలీజ్ చేయగా.. భారీ స్థాయిలో మూవీ సక్సెస్ అయ్యింది. 

ఈ క్రమంలో జపాన్ లో దేవర 2 ఉంటుందనే విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్ వైరల్ అవుతుంది. కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవర 2 ని ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా తర్వాత ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. దీనికి సంబంధించిన నరేషన్ కూడా ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్. దీంతో ఈ సీక్వెల్ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..