ఐసీసీ కమిటీ చైర్మన్‌గా గంగూలీ.. 

By Ravi
On
ఐసీసీ కమిటీ చైర్మన్‌గా గంగూలీ.. 

ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ మెన్స్ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా సెలెక్ట్ అయ్యారు. దుబాయిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ వార్షిక సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్‌ గా నియమించారు. టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం ప్యానెల్‌ సభ్యుడిగా కొనసాగనున్నాడు. 2000 నుంచి 2005 వరకు భారత జట్టు కెప్టెన్‌గా పని చేసిన గంగూలీ.. 2021లో మొదటిసారిగా ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా సెలెక్ట్ అయ్యారు. మూడేళ్ల పదవీకాలం తర్వాత అనిల్‌ కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడంతో గంగూలీ చైర్మన్‌గా నియామకమయ్యారు.

ఇక లక్ష్మణ్‌తో పాటు డెస్మండ్‌ హేన్స్‌, హమిద్‌ హసన్‌, టెంబా బవుమా, జొనాథన్‌ ట్రాట్‌ కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. గంగూలీ ఈ కమిటీ వన్డే క్రికెట్‌ ఒకే బంతిని ఉపయోగించాలని సజెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో రెండు కొత్త బాల్స్‌ రూల్స్‌ చాలాకాలంగా అమలులో ఉన్నది. కమిటీ సిఫారసులను ఐసీసీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అమలులోకి వస్తుంది. జింబాబ్వేలోని హరారేలో ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. బౌలర్లు వేర్వేరు కొత్త బంతులను ఉపయోగించడం వల్ల.. బంతి గట్టిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా పరుగులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!