కళ్యాణ్ రామ్ కోసం తారక్ ఎంట్రీ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. కాగా నేడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంఛ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అందుకు హైదరాబాద్ లోని శిల్పకలావేదిక ను రెడీ చేస్తున్నారు.
ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఎన్టీఆర్ వస్తున్నాడు అంటేనే ఆ క్రేజ్ వేరు. దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పోయింట్ అయ్యారు. ఇక ఈరోజు కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ కు రాబోతుండడం అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఇక ఎన్టీఆర్ త్వరలోనే వార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.