పాతబస్తీలో భజరంగ్‌దళ్ భారీ బైక్ ర్యాలీ

By Ravi
On
పాతబస్తీలో భజరంగ్‌దళ్ భారీ బైక్ ర్యాలీ

హైదరాబాద్ పాతబస్తీలో హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిపుర డివిజన్‌లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ స్నేహమెహర హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు, యువకులు కాషాయం జెండాలతో జైశ్రీరామ్‌ నినాదాతో కన్నుల పండుగగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది. ఈ బైక్ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సౌత్ జోన్ డీసీపీ స్నేహమెహర నేతృత్వంలో అడుగడుగున సీసీ కెమెరాలతో బైక్ ర్యాలీ కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎండీ జావిద్, ఛత్రినాక ఏసీపీ సీహెచ్‌ చంద్రశేఖర్, ఛత్రినాక సీఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ, మొగల్‌పుర సీఐ  శ్రీనుతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest News

హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..! హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
హైదరాబాద్ TPN : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అష్రఫ్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో డబల్ మర్డర్స్‌లో నిందితుడిగా...
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..