విశ్వంభర నుంచి ఫస్ట్ సాంగ్ అవుట్

By Ravi
On
విశ్వంభర నుంచి ఫస్ట్ సాంగ్ అవుట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన వశిష్ట ప్లాన్ చేస్తున్న భారీ ఫాంటసీ మూవీ ఇది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా మ్యూజికల్ ట్రీట్ ను అందించారు. అయితే ఈ సాంగ్ నిజంగానే సినిమాకు చార్జ్ బస్టర్ గా నిలిచేలా చేశారు. ఎన్నో సంవత్సరాలు తర్వాత కీరవాణి మెగాస్టార్ కాంబోలో వచ్చిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఎంటర్ టైన్ చేసేలా కనిపిస్తుంది. 

ఇక లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం కూడా నిజంగా అద్భుతంగా ఉంది. ఈ సాంగ్ ని శంకర్ మహదేవన్ పాడటం మరో హైలెట్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ గ్రేస్ స్టెప్స్ తో ఎంటర్ టైన్ చేశారు. ఈ సాంగ్ విజువల్ వండర్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ విజువల్ వర్క్ చూస్తే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. విశ్వంభర నుండి వచ్చిన ఈ సాంగ్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

Advertisement

Latest News