ఏఐ హెల్ప్ తో బిడ్డ జననం.. అద్భుతం..

By Ravi
On
ఏఐ హెల్ప్ తో బిడ్డ జననం.. అద్భుతం..

న్యూయార్క్, మెక్సికోలోని వైద్యులు అద్భుతాన్ని సృష్టించారు. ఏఐ టెక్నాలజీ హెల్ప్ తో ఒక మహిళకు ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ కలిగించారు. తాజాగా 40 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో శిశువు జన్మించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ఏఐ సాయంతో శుక్ర కణాన్ని నేరుగా అండంలోకి పంపించారు. ఐవీఎఫ్‌లో ఈ ప్రక్రియ చాలా కామన్. అయితే ఐవీఎఫ్‌ లో ఇప్పటి వరకు హ్యుమన్ హెల్ప్ తోనే జరిగింది. కానీ మొదటిసారి 23 దశలను మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం కంప్లీట్ చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ ఐవీఎఫ్‌ విధానంలో సంతానోత్పత్తిని కల్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. 

పూర్తిగా ఏఐ సాయంతోనే 40 ఏళ్ల మహిళ గర్భం ధరించడం జరిగింది. దీంతో ఈ ప్రక్రియ వైద్య రంగంలో ఇదొక సెన్సేషన్ గా మారింది. మెక్సికోలో ప్రస్తుతం మహిళ, శిశువు క్షేమంగానే ఉన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ జాక్వెస్ కోహెన్ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరిగింది. ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించారు. గతంలో విఫలమైన ఈ ప్రయత్నం.. తాజాగా విజయవంతం కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News